Sunday, November 17, 2024

కోవాగ్జిన్ పై తొల‌గిన అనుమానాలు..వెల్ల‌డించిన లాన్సెట్ ఇన్ఫెక్ష‌న్స్ డిసీజెస్ జ‌ర్న‌ల్..

కోవాగ్జిన్ పై నెల‌కొన్న అనుమానాలు తొల‌గిపోయాయి. కోవిడ్ ల‌క్ష‌ణాల‌పై కోవాగ్జిన్ 50శాతం ప్ర‌భావంతంగా ప‌ని చేస్తుంద‌ని లాన్సెట్ ఇన్ఫెక్ష‌న్స్ డిసీజెస్ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. హైదరాబాద్ బెస్డ్ భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. దేశీయంగా తయారవుతున్న టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. సీరం ఇన్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ తో పాటు… జైడస్ క్యాడిలా రూపొందిన జైకోవ్-డి వ్యాక్సిన్లు కూడా దేశీయ ఫార్మా కంపెనీలే రూపొందించాయి. ఇటీవలే కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగపు అనుమతిని ఇచ్చింది. దీంతో ఇతర దేశాలు కోవాగ్జిన్ టీకాను ఎగుమతి చేయడానికి మార్గం సుగమమైంది.

ఇతర ప్రపంచ దేశాలు కూడా ప్రస్తుతం కోవాగ్జిన్ ను ఆమోదిస్తున్నాయి..రోగ లక్షణాలు ఉన్న కోవిడ్ బాధితుల్లో.. లక్షణాలపై కోవాగ్జిన్ సమర్థవంతంగా పోరాడిందని తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి మే వరకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 2,714 మంది ఆసుపత్రి ఉద్యోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోవాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నవారిలో వ్యాధికి వ్యతిరేకంగా 50 శాతం ప్రభావవంతంగా ఉంటుంది లాన్సెట్ ఇన్ఫెక్షయిస్ డిసీజెస్ జర్నల్ లో ప్రచురించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement