Sunday, November 17, 2024

పీపుల్​ ఫ్రెండ్లీగా కోర్టులు ఉండాలే.. ఆధునిక వసతులు కల్పించేందుకు చర్యలు : హైకోర్టు జ‌డ్జీలు

ఖమ్మం : మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమని, ప్రతి ఒక్కరు శారీరక శ్రమతో శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవలని హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర రెడ్డి , వినోద్ కుమార్, నవీన్ రావు , వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కోర్టులో నూతన భవనాలు, వ్యాయామశాలను ప్రారంభించి ప్రసంగించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పర్యవేక్షణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులను కార్పొరేట్ స్థాయిలో అబివృద్ది చేయడమే గాకుండా.. పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కరోనా సమయంలో న్యాయమూర్తులు , ఉద్యోగులు , న్యాయవాదులు ధైర్యంగా పనిచేసి కేసులను పరిష్కరించారు.

న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పనకు హైకోర్టు ఆధ్వర్యంలో కృషి జరుగుతుందని , సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామన్నారు. కోర్టు లు , పోలీసు స్టేషన్లు అంటే భయం పోయే విధంగా’ పీపుల్ ప్రెండ్లీ’ విధంగా పనిచేయాలన్నారు. న్యాయవాదులు తమ వృత్తి లో నైపుణ్యాలను పెంపోందించుకోవలని , అందుకు సీనియర్ న్యాయవాదుల మార్గదర్శకం కావలన్నారు. న్యాయవాదులు , న్యాయమూర్తులు రెండు కాడెద్దుల వలె కల్సి పని చేయలన్నారు. కోర్టు లో జిమ్ ఏర్పాటు చేయడం ఖమ్మం లోనే ప్రపధమమని , మిగిలిన జిల్లాలకు ఇది ఆదర్శ ప్రాయమని అన్నారు. జిమ్నాజియం ఏర్పాటు కు తోడ్పాటు నందించిన సీనియర్ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ , వారి తండ్రి స్వామి గురునాధంను ఈ సందర్భంగా అభినందించి సన్మానించారు.

కార్యక్రమంలో న్యాయమూర్తులు అరుణ కుమారి , డేనీరూత్ , శ్యాంశ్రీ , అఫ్రోజ్ అక్తర్ , అబ్దుల్ రఫీ , సాయి భూపతి , శ్రీనివాస్ , జావీద్ పాషా ,అనితా రెడ్డి ,శాంతిసోని, మౌనిక , పూజిత , భారతి బార్ బాధ్యులు కోనాచంద్రశేఖర్ గుప్తా , గురుమూర్తి, ఇమ్మడి లక్ష్మీ నారాయణ , రవి ప్రసాద్ , కృష్ణారావు , మాధవి, సంపత్, ఆనంద్ , సీనియర్ న్యాయవాదులు స్వామి రమేష్ , కాటంనేని రమేష్ ,పోట్ల మాధవ రావు , సత్యప్రసాద్ ,నిరంజన్ రెడ్డి, మందడపు శ్రీనివాసరావు , బిచ్చాల తిరుమల రావు , తెల్లాకుల రమేష్ బాబు , నేరెళ్ళ శ్రీనివాసరావు , పాల్గొన్నారు. కలెక్టర్ గౌతమ్ , విష్ణు వారియర్, ఆదర్శ్ సురభి , ప్రవీణ , కోర్టు లో న్యాయమూర్తులు మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement