జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని మంచి మార్గంలో పెట్టేందుకు దేవుడి నాకు ఇచ్చిన శర్వశక్తులు, సకల మేథోసంపత్తిని ఉపయోగించి, చివరి రక్తం బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ దేశం కూడా దారి తప్పి పోతోంది. పిల్లలకు కర్ణాటక వెళ్లి చదువుకోవాలంటే భయపడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలి. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి లక్షా 50 వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్రతి రోజూ 580 వరకు విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. తెలంగాణలో ఎక్కడికి పోయినా ఎకర భూమి 20 లక్షలకు పైగానే ఉంది. మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.
చివరి రక్తం బొట్టు ధారపోసైనా ఈ దేశాన్ని చక్కదిద్దుతా – రైతులు ధనికులయ్యే పరిస్థితి : సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement