న్యూఢిల్లీ: కేంద్రం దగ్గుమందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబుల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి దగ్గు మందు ఎగుమతులపై నిబంధనలు వర్తించనున్నారు. భారత్‌కు చెందిన పలు ఫార్మా కంపెనీలు ఎగుమతి చేస్తున్న దగ్గు సిరప్‌ల నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తిన తర్వాత కేంద్రం ఈ నిబంధనలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ల్యాబ్స్ దగ్గు సిరప్‌లను పరీక్షించిన తర్వాత.. తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాలని నిబంధన విధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement