Friday, November 22, 2024

అవినీతిని అణిచి వేశాం – పార‌ద‌ర్శ‌క‌త తెచ్చాం – బ‌డ్జెట్ పై విమ‌ర్శ‌లు స‌హ‌జం – సీఎం కేసీఆర్

రైతు బంధును ఎలా అమలు చేస్తున్నామో చూస్తున్నార‌ని అన్నారు సీఎం కేసీఆర్. అప్పులు చేసే రాష్ట్రాల్లో మ‌న ర్యాంకు 25 అని తెలిపారు.. రిజ‌ర్వ్ బ్యాంక్ నివేదిక చెప్పిన విష‌య‌మిదని అన్నారు. మార్కెట్ బారోయింగ్స్ ని అప్పులుగా చూడ‌కూడ‌ద‌న్నారు.ఆర్థిక వ‌న‌రులుగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌న్నారు. అవినీతిని అణిచి వేశాం..పార‌ద‌ర్శ‌క‌త తెచ్చామ‌న్నారు. క‌ఠిన‌మైన ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తున్నామ‌న్నారు. కొత్త రాష్ట్ర‌మైనా తెలంగాణ అద్భుతాలు సాధిస్తోంద‌న్నారు. బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని స్ప‌ష్టం చేశారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత అద్భుతంగా ఉంద‌ని అధికార స‌భ్యులు ప్ర‌శంసిస్తారు. ప‌స‌లేని, ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని విప‌క్షాలు విమ‌ర్శిస్తాయి.. ఈ విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని కేసీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. త‌న ఆరోగ్యం మంచిగా ఉండాల‌ని కోరుకున్న స‌భ్యుల‌కు వ్య‌క్తిగ‌తంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ప్ర‌జాస్వామ్యం ప‌రిణితి చెందే క్ర‌మంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో జ‌ర‌గ‌వ‌ల‌సిన చ‌ర్చ‌ల స‌ర‌ళి ఇంప్రూవ్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. యువ నాయ‌క‌త్వానికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. స‌క్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు.

బ‌డ్జెట్ అంటే బ్ర‌హ్మ‌ప‌దార్థం అన్న‌ట్టు, అంకెలు మాత్ర‌మే చెప్త‌రు అన్న‌ట్టు మ‌న దేశంలో ప్ర‌బ‌లి ఉంద‌న్నారు. పార్ల‌మెంట్‌లో కానీ, వివిధ రాష్ట్రాల బ‌డ్జెట్‌ల్లో కానీ రెండు విష‌యాలు గ‌మ‌నిస్తాం. ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతారు. అద్భుత‌మైన బ‌డ్జెట్ అని అధికార స‌భ్యులు, ప‌స‌లేని, ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని విప‌క్ష స‌భ్యులు అంటారు. ఈ అభిప్రాయంలో మార్పు లేదు. సీట్లు మారినా కూడా ఇదే ధోర‌ణి కొన‌సాగుతోంది. బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు. ఈ స‌మ‌కూర్చ‌బ‌డ్డ నిధుల‌ను ఎలా ఉప‌యోగించాల‌నేది కూడా ప్ర‌ధానం అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కొత్తపుంత‌లు తొక్కుతోంది. మొట్ట‌మొద‌టి దేశ‌ బ‌డ్జెట్ 190 కోట్లు.. దాంట్లో 91 కోట్లు ర‌క్ష‌ణ రంగానికే. ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివేట‌ప్పుడు చెన్నారెడ్డి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు. అప్పుడు ఏపీ బ‌డ్జెట్ 680 కోట్లు. ఇప్పుడేమో ల‌క్ష‌ల కోట్ల‌లో మాట్లాడుతున్నామ‌న్నారు. అలా స‌మ‌కూర్చుకున్న నిధులపై అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని కేసీఆర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement