2019-20లో బిజెపికి వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి రూ.785.77 కోట్ల మేర విరళాలు అందాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌కు అందిన విరళాలకంటే ఐదు రెట్లు ఎక్కువ. ఈ మొత్తంలో డిఎల్‌ఎఫ్ లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, జిఎంఆర్ ఎయిర్ పోర్టు డెవలపర్స్ ఇతర బడా కార్పోరేట్ సంస్థలతో కూడిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రూ.217 కోట్ల మొత్తం అందింది. అలాగే జెఎస్‌డబ్ల్యు గ్రూపు సంస్థలకు సంబంధించిన జనకల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.45.95 కోట్లను అందజేసింది. హిందాల్కోకు చెందిన సమాజ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.3.75 కోట్లను, ఎబి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.9 కోట్లను బిజెపికి సమర్పించుకున్నాయి. అంతేకాదు ఐటిసి లిమిటెడ్ నుంచి హల్దీరామ్ స్నాక్స్ వరకు అనేక కంపెనీలు కాషాయ పార్టీకి బూరి విరళాలు అందజేశాయి. జాతీయ గుర్తింపు పొందిన మిగిలిన పార్టీల్లో కాంగ్రెస్‌కు రూ.139.01 కోట్లు, సిపిఎంకు రూ.19.69 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 8.08 కోట్లు, సిపిఐకి రూ.1.29 కోట్లు, ఎన్‌సిపికి రూ.59.94 కోట్లు వచ్చినట్లు ఆయా పార్టీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. అయితే బిఎస్‌పి ఈ కాలంలో తమకు విరాళాలు ఏమీ అందలేదని నివేదించింది
Advertisement
తాజా వార్తలు
Advertisement