Friday, November 22, 2024

Covid variant : బుసలు కొడుతున్న ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలకు వణుకు

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు కారుస్తోంది. కొత్త రూపం మార్చుకుని ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చేసిన బీ 1.1.529 కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. దీన్ని ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంటుందని చెబుతున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్ వానా దేశాల్లో ఈ వేరియంట్ వెలుగు చూశారు. బెల్జియం, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ బయట పడడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలు నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు భారత్ లో ఈ రకం వేరియంట్ కేసులు ఇంకా నమోదు కాలేదు. కేంద్రం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement