Saturday, November 23, 2024

ఈ ఏడాది కూడా పరీక్షలు లేకుండానే పాస్?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలు మినహా స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం బంద్ చేసింది. దీంతో ఫిబ్రవరిలో తెరుచుకున్న విద్యాసంస్థలు నెలరోజుల వ్యవధిలోనే కరోనా వ్యాప్తితో మరోసారి మూతపడ్డాయి. అంతేకాకుండా డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా విద్యాశాఖ అధికారులు వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి. వర్కింగ్ డేస్ తక్కువ ఉండటం, సిలబస్ పూర్తి కాకపోవడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇలాంటి పరిస్థితుల మధ్యే.. పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్ చేశారు. ఈసారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే స్పష్టత రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement