ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,871 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,759 మందికి పాజిటివ్ అని తేలింది. ఒకే రోజు కరోనా కాటుతో 31 మంది మరణించారు. అటు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,474 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,186, శ్రీకాకుళం జిల్లాలో 1,336, కర్నూలు జిల్లాలో 1,367, నెల్లూరు జిల్లాలో 816, అనంతపురం జిల్లాలో 789, తూ.గో. జిల్లాలో 992, విశాఖ జిల్లాలో 844, విజయనగరం జిల్లాలో 562, కృష్ణా జిల్లాలో 679, ప్రకాశం జిల్లాలో 345, కడప జిల్లాలో 279, ప.గో. జిల్లాలో 90 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
గత 24 గంటల్లో 3,992 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 31 మంది కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,97,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,22,977మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 66,944గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,541గా ఉంది.