దేశంలో కరోనా వైరస్ శరవేగంగా ప్రజలపై విరుచుకుపడుతోంది. ఒక్కరోజులోనే ఏకంగా 1,68,912 కేసులు బయటపడ్డాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. అటు కరోనా కారణంగా నమోదైన మరణాలు కూడా రికార్డు సృష్టించాయి. ఆదివారం ఒక్కరోజే 904 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది నమోదైన మరణాల సంఖ్యను పోలిస్తే ఇదే గరిష్ఠం. తాజా ఫలితాలతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 1.35 కోట్లు దాటాయి. ఇందులో 1.21 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం 12.01 లక్షల యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. ఇక ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 1,70,179 మంది కరోనాకు బలైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో పరిస్థితి ప్రమాదకరంగా మారగా.. అటు ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లలోనూ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. అటు ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో క్రమంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 25,78,06,986 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 11,80,136 పరీక్షలు చేశామని ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement