ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజూ 3 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లిపర మండలాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. తెనాలి మండలంలోని పెదరావూరు, అంగలకుదురు, కఠెవరం గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 27 వరకు లాక్‌డౌన్ విధించారు. ఈ మూడు గ్రామాల్లో ఉ.6 గంటల నుంచి ఉ.11 గంటల వరకే వాణిజ్య కార్యకలాపాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. కాగా ఆ మూడు గ్రామాల పెద్దలు కోరడంతోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారి రవిబాబు తెలిపారు. అత్యవసర విభాగాలైన మెడిసిన్, పాల విక్రయాలను ఆంక్షల నుంచి సడలించామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్ ధరించాలన్నారు. అత్యవసరమైతే బయటికి రావాలే తప్ప అనవసరంగా మాస్కులు లేకుండా బయటకు తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement