తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గాంధీలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం గాంధీలో
400 మందికి చికిత్స కొనసాగుతోంది. గత రెండు వారాలుగా కొరోనా సివియార్టీ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో ప్రతిరోజు వెయ్యి లోపు కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో కేసులు సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు కరోనాతో గాంధీ ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
మరోవైపు తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని హెల్త్ డైరెక్ట్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, వైరస్ పూర్తిగా తగ్గలేదని స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉందని ఇలాగే కొనసాగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పండుగలు, సభలు, సమావేశాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
గాంధీలో సాధారణ సేవలు పెంచాలని చూస్తున్న తరుణంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గాంధీ హాస్పిటల్లో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమేనని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆగస్టు 3 నుంచి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని రాజారావు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి!