కరోనా థర్డ్ వేవ్ విజృంభనతో పలు రాష్ట్రాలే కాదు పలు దేశాలు కూడా అప్రమత్తమయి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా కరోనాపై సంచలన నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ దేశం. కరోనాని సాధారణ ఫ్లూ గానే తాము భావిస్తున్నామని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు చెప్పడం విశేషం. దీనిపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆందోళన పడదని వెల్లడించింది. అంతే కాకుండా దేశంలో కరోనా ఆంక్షలను అన్నింటినీ కూడా ఎత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ లో మాస్క్ తప్పని సరి కాదు, అలాగే భౌతిక దూరం వంటి ఆంక్షలు ఎవీ కూడా అమలులో ఉండవని చెప్పారు.
అలాగే శుభ కార్యాలు, రెస్టారెంట్లు, పబ్ లు, క్లబులు అన్నింటికీ పూర్తి స్థాయి అనుమతులను ఇచ్చారు. ప్రజలు కరోనా తో కలిసి సహజీవనం చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా వల్ల ఎన్ని నిబంధనలు పాటించినా.. దూరం కాదని వివరించారు. అందుకే కరోనా వైరస్ పై తమ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాలికలను సిద్ధం చేసుకున్నట్టు ఇంగ్లాండ్ ప్రభుత్వం వర్గాలు చెప్పాయి. అయితే ప్రజలు అందరూ కూడా వ్యాక్సిన్లు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..