ప్రపంచం అంతా కరోనా కల్లోలంతో అల్లాడిపోతోంది. కరోనా,ఓమిక్రాన్ బారిన పడినవారు కేవలం ఆరు నుంచి ఏడు రోజుల్లోనే కోలుకుంటున్నారని WHO అధికారులు చెప్పారు. కాగా కరోనా సోకిన వారు 14రోజులు క్వారంటైన్ లో ఉండి తీరాల్సిందేనని WHO స్పష్టం చేసింది. ముందుగానే జనాల్లోకి వస్తే ఇన్ ప్ల్యూయెంజాతో పాటు కరోనా బారిన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఓమిక్రాన్ వేరియంట్ పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుందని వివరించింది. ఓమిక్రాన్ అంత వేగంగా విస్తరించే వైరస్ ఇప్పటి వరకు లేదంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ జగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్క్ లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement