Saturday, November 23, 2024

16 ఏళ్ల బాలుడికి కరోనా టీకా..

మధ్యప్రదేశ్‌లోని మెరెనా జిల్లాలో 16 ఏళ్ల బాలుడికి కరోనా టీకా ఇవ్వడం కలకలం రేపుతోంది. బాలుడికి టీకా ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అంబా తాలూకాలోని బాగ్‌కాపూర్‌కు చెందిన కమలేశ్ కుష్వాహా కుమారుడు పిల్లూకు శనివారం ఓ కేంద్రంలో టీకా వేశారు. ఆ వెంటనే బాలుడికి తలతిరుగుతున్నట్టు అనిపించి నోటి నుంచి నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్ తరలించాల్సిందిగా సూచించారు. బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. బాలుడిని గ్వాలియర్ తీసుకెళ్లారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. మరోవైపు, ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు వేస్తుండగా, ఆ వయసు లోపు వారికి ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ బాలుడికి టీకా ఎలా వేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏడీ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత, 25 మంది అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement