Friday, November 22, 2024

బూస్ట‌ర్ డోస్ ని ఎప్పుడు తీసుకోవ‌చ్చంటే

క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న తొమ్మిది నెల‌ల త‌ర్వాత మూడోడోసు వ్యాక్సిన్ గా బూస్ట‌ర్ డోస్ ని తీసుకోవ‌చ్చ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. బూస్ట‌ర్ డోస్ అందుబాటులోకి వ‌స్తే ఓమిక్రాన్ వేరియంట్ ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతం ఓమిక్రాన్ ప్ర‌పంచాన్ని ఒణికిస్తుంది. దాంతో బూస్ట‌ర్ డోసు ఇవ్వ‌డంపై చ‌ర్చిస్తున్నారు.కేంద్రానికి చాలా రాష్ట్రాల నుంచి బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ముందుగా వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోసులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. తాజాగా ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం బూస్టర్ డోసుపై వివరాలను పార్లమెంటరీ ప్యానెల్ కు వెల్లడించినట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement