పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కి కరోనా సోకింది. అయితే తనకి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని తనని కలిసిన వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని చెప్పారు. పంజాబ్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమరీందర్ కరోనా బారిన పడటం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో పాటు పొత్తు భాగస్వామి బీజేపీ కూడా దెబ్బే. కొన్ని రోజుల పాటు ప్రచారంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై కోవిడ్ బారిన పడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..