Friday, November 22, 2024

భారత్ పై మూడో వేవ్‌ ప్రభావం తక్కువే

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. చైనా నా రష్యా సహా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మూడో దశ భయాలు వెంటాడుతున్నాయి. అయితే భారత్ లో కరోనా మూడోవేవ్‌పై ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య నిపుణులు అంటున్నారు. ఏవై 4.2 వేరియంట్‌ అంతగా ప్రభావవంతమైంది కాదని చెబుతున్నారు.

యూరప్‌ దేశాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో జరగకపోవడం, కొవిడ్‌ నిబంధనలు సరిగ్గా పాటించకపోవటం వల్ల కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. డెల్టా వేరియంట్‌లో 67 ఏవై రకానికి చెందిన వేరియంట్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఇవి 21ఏ, 21 ఐ, 21జే అనే మూడు ఉప వర్గాలకు చెందినవి. ఏవై 4.2 అనేది 21 ఐ రకానికి చెందినది. ప్రపంచంలో 21 జే రకానికి చెందిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలైన డెల్టా 21ఏ రకానికి చెందినది. మనదేశంలో ఏవై 4.2 రకానికి చెందిన వేరియంట్‌ కేసులు ఈ ఏడాది జూన్‌లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో సెప్టెంబర్‌లో 2 రెండు కేసులు గుర్తించారు. జూన్‌ నుంచి ఇప్పటివరకు ఏవై 4.2 వేరియంట్‌ మనదేశంలో పెద్దగా ప్రభావం చూపలేదని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement