తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ ఏరియాలోనే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్లకు, నర్సులకు అందరికీ ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం హాస్పిటల్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం చెప్పిందన్నారు. తెలంగాణలో 4 రేట్లు కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పెరిగిందన్న డీహెచ్.. ఆస్పత్రుల్లో అడ్మిట్ సంఖ్య పెద్దగా లేదన్నారు. 90 శాతం కేసుల్లో లక్షణాలు లేవని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
మరోవైపు వ్యాక్సినేషన్‌ను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లోకి, ఆఫీసులోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేయనుంది. ఈ నెల 8 నుంచి సెలవులు కావడంతో స్కూళ్లలోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital