Tuesday, November 19, 2024

రికార్డ్..25 కోట్ల మందికి కరోనా టెస్టులు

దేశంలో కరోనా వీర విహారం చేస్తోంది. ప్రస్థుతం ఒక రోజు కేసులు లక్ష వరకు వస్తున్నాయి. నిన్న లక్ష మందికి కరోనా సోకినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఇవాళ 96 వేల మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 26 లక్షల 86 వేల 49కి పెరగ్గా.. లక్షా 65 వేల 547 మంది మహమ్మారి కారణంగా మరణించారు. మన దేశం కరోనా టెస్టుల్లో ఓ మైలు రాయిని అధిగమించింది. ఇప్పటిదాకా 25 కోట్ల టెస్టులు చేసింది. మంగళవారం 12 లక్షల 11 వేల 612 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 25 కోట్ల 2 లక్షల 31 వేల 269 మంది టెస్టులు చేయించుకున్నారు.

ఇక దేశంలో ఇంకా 7 లక్షల 88 వేల 223 మంది కరోనాతో చికిత్స తీసుకుంటుండగా.. కోటీ 17 లక్షల 32 వేల 279 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 8 కోట్ల 31 లక్షల 10 వేల 926 మంది కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 43 లక్షల 966 మందికి వ్యాక్సిన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement