దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. అయితే తాజాగా కరోనా సోకిన వారిలో కొందరికి శ్యాససంబంధమైన జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టల్లో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వారికి క్షయకు సంబందించిన టెస్టుకు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్నాక అనేక మంది క్షయవ్యాధికి గురవుతున్నారని కేంద్రానికి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది.
క్షయవ్యాధి సోకిన వారికి కరోనా టెస్టులు కూడా నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా, క్షయ రెండూ కూడా ఊపిరితిత్తులపై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేస్తాయి. కరోనా సోకిన వారిలో ఉన్న లక్షణాలే క్షయ వ్యాధి సోకిన వారిలో కూడా ఉంటాయి. 2020లో క్షయవ్యాధి కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టగా, గత కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇది కూడా చదవండి :