Saturday, November 23, 2024

Covid19: ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి.. ముంబైలో రూల్స్ స్ట్రిక్ట్..

హస్తినలో ఊహించని విధంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గురువారం 1313 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. బుధవారంతో పోలిస్తే.. గురువారం 42 శాతం అధికంగా కరోనా కేసులు వెలుగుచూశాయి. 7 నెలల తరువాత దేశ రాజధానిలో అధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మే 26న ఢిల్లీలో 1.93 శాతం పాజిటివ్‌ రేటుతో 1,491 కేసులు నమోదయ్యాయి. బుధవారం 923 కేసులు నమోదయ్యాయి. గురువారం ఏకంగా 1313కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1.73 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. ఇప్పటి వరకు 14లక్షల కేసులు నమోదవ్వగా.. 25వేల మంది చనిపోయారు. ప్రస్తుతం 3,081 యాక్టివ్‌ కేసులున్నాయి.

ముంబైలో కఠిన ఆంక్షలు
మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో కఠిన ఆంక్షలు విధించింది. బీచ్‌లు, మైదానాలు, పార్‌ ్కలు, ఉద్యానవనాలు వంటి పబ్లిక్‌ ప్రాంతాలకు సాయంత్రం 5 గంటల తరువాత వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అమల్లోకి వచ్చాయి. జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని ముంబై పోలీసులు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. సాయంత్రం 5 నుంచి ఉదయం 5 వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై నిషేధం విధించారు.

అమెరికాలో విస్ఫోటనం
అగ్రరాజ్యంపై కరోనా పంజా విసిరింది. గడిచిన 24 గంటల్లో 5.8లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు రికార్డు స్థాయిలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. డిసెంబర్‌ 22 నుంచి 28 మంది..రోజుకు సగటున 378 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వారంతా 17 ఏళ్లు కింద ఉన్నవారే అని నిపుణులు చెబుతున్నారు. గత వారంతో పోలిస్తే.. 66 శాతం పెరిగింది. అమెరికాలో గడిచిన 24 రోజుల్లో 5,72,029 మంది కరోనా బారినపడ్డారు. 1,362 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 5.52 కోట్ల మంది కరోనాతో బారినపడగా.. 8.45లక్షల మంది మరణించారు. 4.14 కోట్ల మంది రికవరీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement