Saturday, November 23, 2024

కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అలసత్వంగా ఉండొద్దని సూచించింది. రోజువారీ కేసులు తగ్గుతున్నా జూన్ 23తో ప్రారంభమైన వారంలో 71 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదైనట్లు గుర్తుచేసింది. దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో సమస్యాత్మక జిల్లాలు ఉన్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోయిందన్న ఉద్దేశంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని వీకే పాల్ సూచించారు. యూరప్‌లో మళ్లీ కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ పురోగతిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెకట్రరీ లవ్ అగర్వాల్ వివరించారు. జూన్ 21 నుంచి రోజుకు సగటున 50 లక్షల మందికి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటివరకు 34.41 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement