Tuesday, November 26, 2024

చైనాలో క‌రోనా నిబంధ‌న‌లు – ఉల్లంఘించిన వారిని న‌గ‌రం చుట్టూ ఊరేగింపు

ప్ర‌పంచ‌దేశాల‌ని అత‌లాకుత‌లం చేస్తుంది. క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా అధిక‌మ‌వుతున్నాయి. కాగా చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ కేసులు ఒక‌టికూడా న‌మోదుకాక‌పోవ‌డం విశేషం. అయితే అనారోగ్యంతో ఉన్న వ్య‌క్తికి స‌హాయం చేస్తేనే వాహ‌నాల‌ను రోడ్ల‌పైకి అనుమ‌తిస్తామ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు స్థానిక ఆరోగ్య అధికారులు, పోలీసులు కార్ల‌ని ప‌రిశీలుస్తున్నారు. క‌రోనా నిబంధ‌న‌లను ఉల్లంఘించిన వారికి ప‌ది రోజులు జైలు శిక్ష‌తో పాటు , రూ. 5800జ‌రిమానా విధిస్తున్నారు. ఈ మేర‌కు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. అవసరమైన పనుల కోసం వెళ్లాల్సిన వ్యక్తులు మాత్రమే జియాన్‌లో ప్రయాణించాలని ఆదేశాలను జారీ చేసింది. చైనాలో కోవిడ్ నివారణ కోసం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది అక్క‌డి ప్ర‌భుత్వం.

తాజాగా కరోనా నిబంధనలను ఉల్లగించిన వ్యక్తులకు విధించిన బహిరంగ శిక్షలు ప్రముఖ వార్తల్లో చోటు చేసుకున్నాయి. చైనాలోని గ్వాంగ్జీలో కరోనా నిబంధనలను పాటించని నలుగురు వ్యక్తులను అధికారులు అవమానపడేలా శిక్షలు విధించారు. ప్రస్తుతం ఈ వీడియో బ‌య‌ట‌కి రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. చైనా, వియత్నాం మూసివేసిన సరిహద్దుల వద్ద ఈ నలుగురు వ్యక్తులు వలసదారులకు సహాయం చేసి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని తెలుస్తోంది.తెల్లటి సూట్లు ధరించిన నలుగురు పురుషులను గ్వాంగ్జీలోని జింగ్సీ నగరం చుట్టూ ఊరేగించారు. ఈ సమయంలో భారీగా ప్రజలు, పోలీసులు కూడా ఉన్నారు. ఈ నలుగురు వ్యక్తులు చిత్రాలు, పేర్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. కవాతు చేస్తున్న వీరితో పాటు ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. చైనాలో కఠినమైన కోవిడ్ చట్టాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ కంటే తమ పొరుగు దేశాల సరిహద్దులను మూసివేసింది. చైనా జింగ్సీ నగరం వియత్నాంతో సరిహద్దుగా ఉంది. అయితే ఈ సరిహద్దు ప్రాంతాల్లో కరోనా నిబంధనలను ఎవరు ఉల్లగించినా ఇలా శిక్షకు గురవుతారని..ప్ల కార్డులు పట్టుకుని పరేడ్ చేయాల్సి ఉంటుందని.. స్థానికుల హెచ్చరించినట్లు ప్రాంతీయ వార్తా ఛానెల్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement