Tuesday, November 26, 2024

నితిన్ గ‌డ్క‌రీకి క‌రోనా – హోం ఐసోలేష‌న్ లో కేంద్ర మంత్రి

సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా కోర‌ల్లో చిక్కుకుంటున్నారు. కాగా కేంద్ర రోడ్లు, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. త‌న‌కు క‌రోనా సోకిన‌ట్టు ఆయ‌నే వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇంటిలోనే ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు చెప్పారు. కాగా త‌న‌కి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని అన్నారు. అన్ని ప్రొటోకాల్స్ ను పాటిస్తూ నాకు నేనుగా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. హోం క్వారంటైన్ లో ఉన్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయ‌న ఈ మేర‌కు ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడుతున్న మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో పొలిటికల్ లీడర్లపై ఇంత ప్రభావం లేకపోయినా.. ఇప్పుడు థర్డ్ వేవ్ లో అందరూ దాని బారిన పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement