ప్రముఖ టాలీవుడ్ సింగర్ కౌసల్యకు కరోనా పాజిటీవ్ గా తేలింది. దాంతో ఆమె హోం ఐసోలేషన్ లో చికిత్సని తీసుకుంటున్నారు. కాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి లక్షణాలు తీవ్రం గానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం గా ఉంది. కనీసం బెడ్ పై నుంచి కూడా లేవ లేక పోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి.. మరి ఇంత ఇబ్బంది పెడుతోంది. నిన్నటి నుంచి మందులు వేసుకోవటం మొదలు పెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి ముందుకు ఎప్పటిలాగే వస్తాను. దయచేసి అందరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి “అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది సింగర్ కౌసల్య. అందరూ తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..