Friday, November 22, 2024

నటి డింపుల్ హయాతీకి క‌రోనా పాజిటివ్

రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ పాత్ర చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీకి క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపింది హ‌య‌తీ. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనావైరస్ బారిన పడినట్లు తన పోస్ట్‌లో చెప్పొకొచ్చింది.

తనకు కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్నాయి అని, ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపింది హయాతి. తన అభిమానులు, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాల‌ని, చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలని కోరింది. అంతేకాకుండా గతంలో కంటే బ‌లంగా, హెల్తీగా తిరిగి వస్తానని హామీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement