Tuesday, November 19, 2024

ముంబయి ఎయిర్​పోర్ట్​లో 9 మంది ఇంట‌ర్నేష‌న‌ల్‌ ప్రయాణికులకు కరోనా పాజిటివ్​

కరోనా కొత్త వేరియంట్ భ‌యం వెంటాడుతున్న వేళ.. ముంబయి ఎయిర్​పోర్ట్​లో ఇవాళ (శుక్ర‌వారం) ఒకే సారి 9 మంది ఇంట‌ర్నేష‌న‌ల్ ప్యాసెంజ‌ర్స్‌కి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. అయితే వారికి ఒమిక్రాన్​ సోకిందా? లేదా.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు అధికారులు.

అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు దేశీయ ప్రయాణికులకు కూడా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు తప్పనిసరి చేసింది. టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వస్తేనే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. దీంతో పాటు.. ఎయిర్​పోర్ట్​కు వచ్చే వారు కూడా 72 గంటల్లోపు ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్​తో రావాలని స్పష్టం చేశారు ఎయిర్​పోర్ట్ అధికారులు. ముంబయి నుంచి ఇతర రాష్ట్రాలోని పట్టణాలకు దేశీయ విమానాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించిన టెస్టులో 9 మందికి పాజిటివ్​గా తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement