Friday, November 22, 2024

ఆక్సిజ‌న్ నిల్వ‌లు ఉండేలా చూసుకోండి – అన్ని రాష్ట్రాల‌కు లేఖ రాసిన ‘కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి’


క‌రోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లో ల‌క్ష‌ణాలు, స్వ‌ల్ప తీవ్ర‌త క‌లిగి ఉన్నా ఈ వేరియంట్ ప‌ట్ల నిర్లక్ష్యం వ‌ద్ద‌ని, అంద‌రూ త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వైద్య నిపుణ‌లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల‌కు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్. అన్ని రాష్ట్రాలు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ నిల్వ‌లు అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌ని తెలిపారు. 48గంట‌ల పాటు ఆక్సిజ‌న్ బ‌ఫ‌ర్ ల‌భ్య‌త ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను త‌గినంత‌గా నింపాల‌న్నారు. అదే విధంగా ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లను ఎప్ప‌టిక‌ప్పుడు రీ ఫిల్లింగ్ చేస్తూ ఉండాల‌ని, ఇది నిరంత‌రాయంగా జ‌రుగుతూ ఉండాలని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న పీఎస్ఏ ( PSA) ప్లాంట్‌లను బలోపేతం చేయాలని అన్నారు. అవి పూర్తిగా పని చేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాల‌ని చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాలు కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. బ్యాకప్ స్టాక్‌లు, పటిష్టమైన రీఫిల్లింగ్ సిస్టమ్‌లతో పాటు ఆక్సిజన్ సిలిండర్‌లను తగినన్ని ఇన్వెంటరీగా ఉండేలా చూసుకోవాల‌ని రాష్ట్రాల‌ను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు లైఫ్ సపోర్ట్ పరికరాల లభ్యతను నిర్ధారించుకోవాల‌ని, అలాగే ప్రైవేట్ హెల్త్ సెంట‌ర్స్ తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉండాల‌ని చెప్పారు. ఆక్సిజన్ సంబంధిత సమస్యలు, సవాళ్లను సత్వరంగా పరిష్క‌రించేందుకు గ‌తంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను తిరిగి ప్రారంభించాల‌ని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement