Monday, November 25, 2024

క‌రోనాని అంత‌మొందించ‌లేం – అమెరికా అంటువ్యాధుల నిపుణులు ‘ఆంటోనీ ఫౌచీ’

దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌ని, ఆసుప‌త్రుల్లో చేరుతోన్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. క‌రోనా వైర‌స్ తో జీవించే స్థాయికి అమెరికా చేరింద‌ని ఆయ‌న చెప్పారు. సెంట‌ర్ ఫ‌ర్ స్ట్రాట‌జిక్ అండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. సమాజం నుంచి కరోనాను అంతమొందించలేమని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ లాంటి వేరియంట్లు ప్రతి ఒక్కరికీ సోకుతాయని అన్నారు. కాబట్టి కరోనా అంతమవ్వడమన్నది అసాధ్యమన్నారు. కరోనాతో మరిన్ని వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, వ్యాక్సిన్లు వేసుకోని వారిలోనే అవి పురుడు పోసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎన్ని వేరియంట్లు వచ్చినా తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ఎక్కువ మంది దాని బారిన పడి ఉంటారు కాబట్టి.. సహజ రక్షణ లభిస్తుందని ఫౌచీ చెప్పారు. ప్రస్తుతం రోజూ పది లక్షల కేసులు నమోదవుతున్నాయని, లక్షన్నర మంది ఆసుపత్రుల్లో చేరుతున్నార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement