Friday, November 22, 2024

TS | క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు.. రేపటి నుంచి తెలంగాణలో బూస్టర్ డోస్‌

ప్రపంచ వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అల‌ర్ట్ అయ్యింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ వైద్యారోగ్య శాఖ జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో బూస్టర్ డోస్ అందించాలని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణయించింది.

రేపటి (బుధవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కార్బి వ్యాక్సిన్‌’ను బూస్టర్‌ డోస్‌గా అందించనున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్ (డీహెచ్‌) శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకోసం 5 లక్షల డోసులను సిద్ధంగా ఉంచినట్లు ఆయ‌న తెలిపారు. Covacgin, Covishield వ్యాక్సిన్లు మొదటి, రెండో డోస్‌లుగా.. Corbi వ్యాక్సిన్‌ను బూస్టర్ మోతాదుగా తీసుకోవచ్చని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement