కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే రెండు విడతల లాక్ డౌన్లు కంప్లీట్ అయ్యాయి. దీనిలో ప్రత్యేకంగా కొత్త కొత్త వేరియంట్లతో వైరస్ రూపాంతరం చెందుతూ మానవాళిపై అటాక్ చేస్తోంది. ఈ రెండేళ్లలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి.. నిరాశ్రుయులుగా మారారు. వేలాది మంది చనిపోయారు. అయితే ఫస్ట్ వేవ్ లో ఎక్కువగా భయంతోనే చనిపోయినవారున్నారు. ఆ తర్వాత కాస్త ధైర్యం కూడగట్టుకుని బతుకుబండి నెట్టుకొస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ రావడం ఫస్ట్, సెకండ్ డోసులు కంప్లీట్ కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే.. మళ్లీ ఇప్పుడు అత్యంత వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ దూసుకొస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. మరోసారి లాక్ డౌన్ ఉంటుందా అనే భయాందోళనలో జనాలున్నారు..
ఈ క్రమంలో కొంతమంది ఔత్సాహికులు, కవులు, రచయితలు వారి హాస్య చతురతను బయటపెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇవి బాధలు, ఆందోళన చెందుతున్నవారిని కూడా కాస్త నవ్విస్తూ ఎంతో ఊరట చెందేలా చేస్తున్నాయి. సిరియస్ పోస్టుల కంటే ఇట్లాంటి పోస్టులు చాలామందిని రిలీఫ్ చేస్తాయంటున్నారు నెటిజన్లు.. జంద్యాల తిట్లు / హాస్యం గ్రూపు రీ ట్వీట్ చేసిన ఒక పోస్టు మరీ నవ్వించేలా ఉంది.. అదేంటో మీరే చదవండి.. మనసారా నవ్వుకోండి..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..