Saturday, November 23, 2024

చైనాలో పెరుగుతోన్న క‌రోనా.. ప్ర‌త్యేక తాత్కాలిక‌ ఆసుప‌త్రుల‌ను నిర్మిస్తోన్న ప్ర‌భుత్వం

ప‌లు న‌గ‌రాల్లో క్వారెంటైన్ గ‌దులు..ప్ర‌త్యేక ఆసుప‌త్రుల నిర్మాణం చేప‌ట్టింది చైనా ప్ర‌భుత్వం. రోజు వారీ కేసులు 40వేల‌కు న‌మోద‌వుతుండ‌టంతో చైనా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌యింది. మేక్ షిఫ్ట్ పద్ధతిలో నిర్మిస్తున్న ఈ కట్టడాలను కరోనా బాధితులను క్వారెంటైన్ లో ఉంచేందుకు ఉపయోగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు 1.30 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్వాంగ్జూ సిటీ శివార్లలో ప్రత్యేక ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గ్వాంగ్జూ సిటీలో నిర్మిస్తున్న తాత్కాలిక ఆసుపత్రులు, క్వారెంటైన్ సెంటర్లలో 2.5 లక్షల మంది వైరస్ బాధితులకు ఆశ్రయం కల్పించవచ్చని ప్రభుత్వ అధికారులు వివరించారు. ఇటీవల సిటీలో కరోనా బారిన పడుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం రోజువారీ కేసులు ఈ సిటీలోనే 7 వేల దాకా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా రాజధాని బీజింగ్ తో పాటు ఇతర మెగా సిటీల్లోనూ వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతోందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement