పుదుచ్చేరి రాష్ట్రంలో 113 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. ఈ క్రమంలో కోరిమేడులోని పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ పొందే 390 మందికి వైద్య పరీక్షలు చేయగా, వారిలో 113 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించి, స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మూసివేశారు. గత కొన్ని రోజులుగా పుదుచ్చేరిలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రత్యేక వైద్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.