Saturday, November 23, 2024

కరోనా దెబ్బకు పడిపోయిన కూల్‌డ్రింక్స్ డిమాండ్

కరోనా మానవ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. కరోనా కారణంగా మార్కెట్లో అనేక రకాల వస్తువుల డిమాండ్ తగ్గిపోయింది. ప్రతి ఏడాది వేసవిలో శీతల పానీయాల వినియోగం అధికంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా శీతలపానీయాల డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఎండలు మండుతున్నా కూల్ డ్రింక్స్ కొనేవారు కనపడటం లేదు. వేసవి వస్తే కూల్ డ్రింక్ బాటిల్ చేతులో పట్టుకునే యువతి ఇప్పుడసలు వాటి జోలికే వెళ్లడం లేదట. కరోనా వస్తే దగ్గు, జలుపు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి అనేక లక్షణాలు కనబడుతున్నాయి.

అయితే, ఇమ్యూనిటీ ఉంటే కరోనా వల్ల ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. జలుబు, దగ్గుకు కారకులుగా ఉండే శీతల పానీయాలను కొంతకాలం సేవించడం మంచిది కాదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీంతో వీటి డిమాండ్ చాలావరకు తగ్గింది. ఇక తమ వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోకపోవడంతో డీలర్ల నుంచి కొత్త సరుకును వ్యాపారులు తెప్పించుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు తమ వద్ద ఉన్న స్టాక్ సేల్ చేసేందుకు పెద్ద పెద్ద మాల్స్ లో ఆఫర్స్ పెడుతున్నారు. అయినా వాటిని ప్రజలు ముట్టుకోవడం లేదట. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఓఆర్ఎస్, ఎనర్జీ డ్రింక్స్ పై పడిందట. ఎక్కువ మంది వీటినే అడుగుతున్నారట. ఓఅర్ఎస్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. కరోనా మహమ్మారిని ఎదురుకోవాలి అంటే ఇమ్యూనిటీనే ప్రధాన ఆయుధం.. దీంతో యువత పాటు వృద్దులు కూడా వీటినే ప్రిఫర్ చేస్తున్నారట.. గతంలో కూల్ డ్రింక్ బాటిల్స్ తో నిండుగా కనిపించే బేకరీలు, కిరాణం దుకాణాలు ఇప్పుడు డిమాండ్ లేక బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఎంతైనా ప్రజల్లో కరోనా భారీ మార్పునే తీసుకొచ్చిందని చెప్పుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement