మన దేశంలో కరోనా కేసులు స్థిరంగాా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా అమలు చేస్తుండటంతో కేసులు పెరగడం లేదు. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఉధృతి ఇంకా అదుపులోకి రావడంలేదు. డెల్టా వేరియంట్ డేంజర్ అయినప్పటికీ, అల్ఫా వేరియంట్ ఎక్కవ దేశాల్లో వ్యాపించింది. ఈ వేరియంట్‌లు ఇప్పుడు గాలిద్వారా వ్యాప్తి చేందేలా రూపాంతం చెందుతున్నాయని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేరీల్యాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. సాధారణ కరోనా కంటే ఆల్ఫా వేరియంట్లు 43 నుంచి 100 శాతం వైరస్ రేణువులను గాల్లోకి వెదజల్లుతున్నారని, సర్జికల్ లేదా గుడ్డ మాస్క్ లు కొంతవరకు అడ్డుకోగలుగుతున్నాయని, పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని, కరోనా వేరియంట్‌లో డేంజర్‌గా చెప్పుకుంటున్న డెల్టా వేరియంట్ కూడా గాలిద్వారా వ్యాప్తి చేందే విధంగా రూపాంతరం చేందే అవకాశాలు ఉన్నాయని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచే రెండో విడత ఐపీఎల్-14