Monday, November 25, 2024

అటు దేశంలో, ఇటు తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి..

దేశంలో నిన్న 4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, ఇవాళ దానికంటే 10 వేలు తక్కువగా రికార్డయ్యాయి. అయితే మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. వరుసగా ఐదో రోజు మూడు వైలకుపైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,488 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 3689 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఇంత భారీసంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరాయి. ఇందులో 1,59,92,271 మంది కోలుకోగా, 33,49,644 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,15,542 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,07,865 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు 15,68,16,031 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,430 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,567 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,790 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,67,727 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,368 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 80,695 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,546 మందికి క‌రోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement