భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 21,87, 205 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,65,60,650 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటి వరకు 71.55 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4.89 లక్షలకు చేరింది.మన దేశం లో కరోనా మహమ్మారి విలయ తాండవమే చేస్తుంది. మొన్నటి వరకు కంట్రోల్ లో ఉన్న ఈ మహమ్మారి కరోనా ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతూ.. బుసలు కొడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కేసులు భారీగా పెరుగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..