దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య 72 రోజుల తర్వాత 71 వేల దిగువకు చేరింది. నిన్న 70,421 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. 24 గంటల్లో 3921 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. కోలుకున్న వారు 2,81,62,947 కాగా.. చనిపోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,73,158 ఉన్నాయి. ఇక వ్యాక్సినేషన్ల సంఖ్య 25,48,49,301కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement