Thursday, November 21, 2024

క‌రోనా కేసులు , మ‌ర‌ణాలు

మ‌ళ్ళీ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా ఒక్కొక్క‌టిగా పెరుగుతున్నాయి. కాగా దేశంలో కొత్త‌గా 7,447 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో క‌రోనాకు 86,415 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న క‌రోనా నుంచి 7,886 మంది కోలుకున్నారు. అలాగే, 391 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,41,62,765కు చేరుకుంది. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,76,869కు చేరింది. ఇక, మొత్తం వినియోగించిన‌ వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,35,99,96,267కు పెరిగింది. ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ల‌ను వినియోగించాల‌ని వైద్యులు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement