Saturday, November 23, 2024

24 గంటలు 28 వేల కేసులు

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న‌ క‌రోనా కేసుల సంఖ్య 24,492గా న‌మోదు కాగా, గ‌త‌ 24 గంట‌ల్లో 28,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,044 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,45,284  మంది కోలుకున్నారు. 2,34,406 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 

ఇటు తెలంగాణలోనూ కరోణ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్య 200 దాటుతోంది. తాజాగా తెలంగాణలో 247 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 29 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో 158 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణలో తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,769కి పెరిగింది. వారిలో 2,98,009 మంది కోలుకున్నారు. ఇంకా 2,101 మందికి చికిత్స జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement