Wednesday, November 20, 2024

అమెరికాలో క‌రోనా క‌ల్లోలం – ఒక్క‌రోజే ప‌ది ల‌క్ష‌ల క‌రోనా కేసులు

అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ మేర‌కు ఒక్క‌రోజే ప‌ది ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఒకే రోజు ఇన్ని కేసులు ఏ దేశంలో న‌మోదు కాలేదు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌టింది. కాగా అమెరికాలో గ‌త నాలుగు రోజుల నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 5,90,000కేసులు న‌మోదు అయ్యాయి. కాగా సోమ‌వారం నాటికి ఆ సంఖ్య కాస్తా రెట్టింపు అయింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం బైడెన్ స‌ర్కార్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. కోవిడ్‌-19 ఉధృతి నేప‌థ్యంలో అమెరికాలో స్కూళ్లు, కార్యాల‌యాల‌ను మూసివేశారు. విమానాల‌ను ర‌ద్దు చేశారు. ఇక క‌రోనా, ఒమిక్రాన్ కేసుల తీవ్ర‌త‌తో హాస్ప‌టల్స్ నిండిపోతున్నాయి. దాదాపు అక్క‌డి ఆస్ప‌త్రుల్లో 70 శాతం వ‌ర‌కు నిండిపోయిన‌ట్టు స‌మాచారం. క‌రోనా బారిన‌ప‌డుతున్న వారిలో ఆరోగ్య సిబ్బంది సైతం అధికంగా ఉండ‌టంపై ఆ దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ తీవ్ర ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు తెలిపారు. కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19) కారణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు నాలుగు నెలల్లో రికార్డు స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం 100,000 మందికి పైగా చేరారు. యు.ఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS) నుండి వచ్చిన తాజా డేటా ప్ర‌కారం.. కోవిడ్-19 కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య చివరిగా 2021 సెప్టెంబర్ 11న 100,000ను దాటింది. ప్రతి ఏడుగురిలో ఒకరు కోవిడ్-19తో బాధపడుతున్నారని రిపోర్ట్స్ తెలిపాయి. అమెరికాలోని ఒహియో, డెలావేర్, న్యూజెర్సీ, వ్యోమింగ్, అలాస్కా వంటి ప్రాంతాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చేరుతున్న పిల్ల‌ల సంఖ్య పెరుగుతుండ‌టం మ‌రింత ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. డిసెంబర్ 31తో ముగిసిన వారంలో ప్రతిరోజూ 500 మందికి పైగా పిల్లలు క‌రోనాతో ఆస్ప‌త్రుల్లో చేరుతున్నార‌ని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) డేటా వెల్ల‌డించింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్ర‌మంలో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హ్యారిస్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ వేరియంట్‌ను అడ్డుకోగ‌లిగే చ‌ర్య‌ల‌పై క‌రోనా వైర‌స్ రెస్పాన్స్ బృందాల‌తో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ స‌మీక్ష చేయ‌నున్న‌ట్లు స్థానిక మీడియా తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement