Friday, November 22, 2024

Breaking | పట్టాలు తప్పి, గూడ్స్​ని ఢీకొట్టిన కోరమండల్​.. వాటిని ఢీకొన్న యశ్వంత్​పూర్ రైలు

ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి.  బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు మూడు వేర్వేరు ట్రాక్‌లపై ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహానగర్ వద్ద ఢీకొన్నాయి. మూడు-మార్గాల ప్రమాదంలో పలువురు వందలాది మంది గాయపడ్డారు. 50 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం అందుతోంది.

ఈ ఘోర రైలు ప్రమాదంలో వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను హుటాహుటిన సమీపంలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇక.. ఎన్డీఆర్​ఎఫ్​, ఎయిర్​ఫోర్స్​ బలగాలు రంగంలోకి దిగాయి. బాధితులను ఎయిర్​ లిఫ్ట్​ చేసి ఆస్పత్రులకు తరలించే ప్రయత్నాలు జరగుతున్నాయి.

ఈ  నేపథ్యంలో గోవా-ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను మడ్గావ్ స్టేషన్‌లో ప్రారంభించే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కొంకణ్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం వర్చువల్​గా​ గోవా-ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించాల్సి ఉంది. దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మడ్గావ్ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ, అశ్విని వైష్ణవ్ ఇప్పుడు ఒడిశాలో ప్రమాద స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రైలు ప్రారంభ వేడుక రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement