Wednesday, November 20, 2024

దీన‌మ్మా జీవితం.. వంటనూనె ధరలు మ‌ళ్లీ పెరుగుత‌య‌ట‌!

దీన‌మ్మా జీవితం.. బ‌త‌కాలా చావాలా..? అని ఇప్ప‌టికే జ‌నం అల్లాడిపోతుంటే.. మ‌రో భ‌యంక‌ర‌మైన బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్‌ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ నెల 28వ తేదీ నుంచి నిషేధం అమలులోకి రానుండగా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే దాకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత్‌ పెద్ద మొత్తం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న తరుణంలో ఎగుమతులపై నిషేధం విధించడంతో మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నది.

ఇక ఆ దేశం నుంచే..
ఇండోనేషియా మొత్తం ప్రపంచంలోనే పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది. ఆ తర్వాత మలేషియా రెండోస్థానంలో ఉన్నది. అయితే, పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోకో విడోడో ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌ దాదాపు 9 మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకుంటున్నది. ఇందులో 70శాతం పామాయిల్‌ ఇండోనేషియా నుంచి భారత్‌కు వస్తున్నది. అయితే, 30శాతం మలేషియా నుంచి దిగుమతి అవుతోంది..

2020-21లో భారత్‌ 83.1లక్షల టన్నుల పామాయిల్‌ దిగుమతి చేసుకున్నది. తాజాగా ఇండోనేషియా నిర్ణయంతో భారత్‌ పామాయిల్‌ దిగుమతి తీవ్రంగా ప్రభావితం కానున్నది. ఇకపై మలేషియాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఎడిబుల్‌ ఆయిల్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీని ప్రత్యక్ష ప్రభావం ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న సామాన్య ప్రజలపై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement