వంటగ్యాస్ ధరలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని సమాచారం. వంటగ్యాస్ సిలిండర్ పై రూ.312రాయితీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందట. ఇప్పటికే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరుకుంది..వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల రూపాయల మార్కుకు చేరుకుంది. కాగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పై రాయితీ ప్రకటిస్తే ఏడు వందల రూపాయలకు వంట గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ పై కేవలం రూ.40 రాయితీ ఇస్తున్నారు. దాంతో తీవ్రవ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ధరలు తగ్గిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..