Saturday, November 23, 2024

బౌద్ధ మత మార్పిడి ఆరోపణలు.. ఢిల్లీ మంత్రి రాజేంద్రపాల్ స్వచ్ఛందంగా​ రాజీనామా!

ఢిల్లీలో జరిగిన బౌద్ధ మత కార్యక్రమంలో ఆమ్​ ఆద్మీ మంత్రి రాజేంద్రపాల్​ పాల్గొనడం.. అందులో వివాదాస్పద ప్రతిజ్ఞ వంటి ఘటనలు బీజేపీ, ఆప్​ పార్టీల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆప్​ మినిష్టర్​ మత కల్లోహాలు చెలరేగాల వ్యవహరిస్తున్నరని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ నుంచి మంత్రిని బర్తరఫ్​ చేయాలని చాలామంది కోరుతున్నారు. దీనికి రెస్పాండ్​ అయిన మంత్రి రాజేంద్రపాల్​ తానే ఇవ్వాల రాజీనామా చేయడం గమనార్హం.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఢిల్లీలో బౌద్ధ మత కార్యక్రమంలో మతమార్పిడి ప్రమాణం వంటి విషయాలు వివాదానికి కారణమయ్యాయి. ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. రాజేంద్ర పాల్ గౌతమ్ ఒక మత మార్పిడి కార్యక్రమంలో హిందూ దేవతలను దూషించినట్లు దేశ రాజధానిలో జరిగిన ఈవెంట్​కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్​గా మారింది. దీంతో పలువురు బీజేపీ లీడర్లు, ప్రజాప్రతినిధులు దీనిపై విమర్శలకు దిగారు.  ఈ విషయంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా వారు వదిలిపెట్టలేదు.

ఇక.. ఇది హిందూ, బౌద్ధమతాలను అవమానించడమేనని, ఆప్ మంత్రులు అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీ విమర్శలు చేశారు. ఆ మంత్రిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. మరోవైపు, బీజేపీ తప్పుడు కేసులు నమోదు చేయడంలో ధిట్ట అని ఆప్ నాయకులు విమర్శల దాడిని తీవ్రం చేశారు. బేజేపీ ఇప్పుడు దేశ వ్యతిరేక పార్టీగా మారిందని మండిపడ్డారు.

కాగా, వైరల్ అయిన వీడియోలో గౌతమ్‌తో పాటు వందలాది మంది ప్రమాణం చేయడం కనిపించింది. ఉద్దేశ్యపూర్వకంగా మైక్రోఫోన్‌లో ఉన్న వ్యక్తి ప్రమాణం ఇలా చెబుతూ ఉంటాడు.. ‘మేము బ్రహ్మ, విష్ణు, మహేశ్, గౌరీ-గణేష్‌లను దేవుళ్లుగా విశ్వసించము. వారిని ఎప్పుడూ ప్రార్థించము. నేను రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా పరిగణించను.. ఎప్పటికీ గౌరీ గణపతి మొదలైనవాటిని లేదా మరే ఇతర హిందూ మత దేవుళ్లు, దేవతలను నేను ప్రార్థించను’ అని ఆ వీడియోలో ఉంది. ‘మిషన్ జై భీమ్’ బ్యానర్‌పై అక్టోబర్ 5న ఢిల్లీలో ‘ఘర్ వాప్సీ ఇన్ బౌద్ధిజం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ వీడియోని మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడం మరింత ఆందోళనకు కారణమయ్యింది.

- Advertisement -

అయితే.. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారినప్పుడు అదే ప్రమాణం చేశారని ఆప్ మంత్రి పేర్కొన్నారు తాము అదే ప్రతిజ్ఞను పునరావృతం చేశామని, 1956 అక్టోబరు 14న బాబా సాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు అతను 22 ప్రమాణాలు చేశాడని చెప్పుకొచ్చారు. తాము కూడా ఇదే తరహా ప్రమాణం చేశామన్నారు. ఇక.. తమ పూర్తి వీడియో చూడాలని, బీజేపీ తన స్వలాభం కోసం ఆ వీడియోని కట్​ చేసి షేర్​ చేస్తోందని మండిపడ్డారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ, అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ చేస్తున్న దేశద్రోహ ఆరోపణలపై మంత్రి గౌతమ్‌ మాట్లాడుతూ.. మానవత్వానికి శత్రువులు, మత రాజకీయాలు, కులం-మతం పేరుతో ఉన్మాద రాజకీయాలు చేస్తారని..  అసలు వారే దేశద్రోహులని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.    

Advertisement

తాజా వార్తలు

Advertisement