Saturday, November 23, 2024

ధైర్యాన్ని వీడొద్దు – మేమున్నాం – ఇండియ‌న్ ఎంబ‌సీ ట్వీట్

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భార‌తీయ విద్యార్థుల‌ను ఆప‌రేష‌న్ గంగా పేరిట ప్రత్యేక కార్యాచ‌ర‌ణ చేప‌డుతోంది కేంద్ర ప్ర‌భుత్వం.
ఇప్ప‌టికీ చాలా మంది స్టూడెంట్లు ఇంకా అక్క‌డే ఉండిపోయారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీలో చాలా మంది భార‌త స్టూడెంట్లు చిక్కుకుపోయారు. త‌మ‌ను కాపాడాల‌ని వారు వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ విజ్ఞ‌ప్తులు ఎక్కువ‌వుతుండటంతో ఇండియ‌న్ ఎంబ‌సీ స్పందించింది. స్టూడెంట్ల‌ను సురక్షితంగా తరలించడానికి సాధ్యమైన అన్ని దారుల‌ను అన్వేషిస్తున్నట్లు చెప్పింది. ఈ మేర‌కు ట్వీట్ చేసింది. స్టూడెంట్ల‌ను ఇండియాకు తీసుకురావ‌డం విష‌యంలో ప్రపంచవ్యాప్త మానవతా సంస్థ రెడ్‌క్రాస్‌తో కలిసి అన్ని మార్గాల‌ను వెతుకుతున్నామ‌ని వెల్ల‌డించింది. సుమీలోని భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి సాధ్యమయ్యే అన్ని విధానాలను అన్వేషించేందుకు రెడ్‌క్రాస్‌తో పాటు అన్ని ఇంటర్‌లోక్యూటర్‌లతో చ‌ర్చించారు. మా పౌరులందరినీ ఖాళీ చేసే వరకు కంట్రోల్ రూమ్ స‌క్ర‌మంగా కొన‌సాగుతుంది. సురక్షితంగా ఉండండి. ధైర్యంగా ఉండండి’’ అని ఉక్రెయిన్ లోని ఇండియ‌న్ ఎంబసీ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement