Tuesday, November 26, 2024

TS | కొన‌సాగుతున్న‌ ఐటీ సోదాలు.. సీన్‌లోకి లైఫ్‌స్టైల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో ఐటీ సోదాలు మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. తాజాగా లైఫ్ స్టైల్‌ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌ రెడ్డిని సీన్లోకి తీసుకొచ్చారు ఐటీ శాఖ అధికారులు. ఆయన కార్యాలయాలు, నివాసంలో కూడా ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. కంప్యూటర్‌, వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌, మొబైల్స్‌ స్వాధీనం చేసుకొని విచారించారు. మధుసూధన్‌ రెడ్డితో పాటు భార్య, కుమారుడిని అధికారులు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో సహ మధుసూధన్‌ రెడ్డి నివాసాలపై రోజంతా ఐటీ సోదాలు కొనసాగాయి. రియల్‌ ఎస్టేట్‌ భాగస్వామ్య వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు.

ఈ మ‌ధ్య కాలంలో బీఆర్‌ఎస్‌ నేతలతో మధుసూధన్‌ రెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీలపై, తదనంతర లింకులపై ప్రశ్నల వర్షం కురిపించి వివరాలు రాబట్టారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ భారీ నిర్మాన రంగ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థతో జరిగిన ఒప్పందాలపై కూడా దర్యాప్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల రియల్‌ ఎస్టేట్‌ సిండికేట్‌పై ఐటీ శాఖ అధికారుల బృందాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 78 బృందాలు నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యాయి. ఆరు రాష్ట్రాల నుంచి 440 మంది ఐటీ అధికారులను నియమించగా వారంతా హైదరాబాద్‌లోనే తిష్టవేశారు.

ఉదయం 6 గంటల నంచే దాడులు ప్రారంభం
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డితో ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ- అధికారుల సోదాలు మూడో రోజూ శుక్రవారం (జూన్‌ 16న) ఉదయం 6 గంటల నుంచే మొదలయ్యాయి. వారి బంధువులు, కార్యాలయాల్లో మూడో రోజు పొద్దుపోయేంత వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కార్యాయాలు, ఇళ్ళపై ఈ ఐటీ- రైడ్స్‌ జరిగాయి. ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు- కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, బ్యాంక్‌ లాకర్స్‌ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు- తెలుస్తోంది. ఈ నెల 14న ప్రారంభమైన ఈ సోదాలు నిరాటంకంగా, నిర్విరామంగా కొనసాగుతుండటం.. పలు కీలక డాక్యుమెంట్లు-, స్వాధీనం చేసుకున్నట్లు- లీక్‌లు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి, ఆందోళన నెలకొంది. ఐటీ దాడుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతల్లో భయాందోళన కనిపిస్తోంది.

- Advertisement -

ఏకకాలంలో 60 చోట్ల ఐటీ దాడులు
బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు అర్ధరాత్రి వరకు సోదాలు జరగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 60 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు, సోదాల్లో పాల్గొన్నారు. హార్డ్‌ డిస్క్‌లు, బ్యాంక్‌ లాకర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి సైతం నోటీ-సులిచ్చి వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై ఐటీ- దాడులు జరగడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ నేతలు అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ దాడుల పర్యవసానాన్ని పరిశీలిస్తే అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వ్యాపార లావాదేవీలపై ఐటీ- అధికారుల ఆరా..
ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇళ్లలో గత మూడు రోజులుగా ఏకదాటిగా సోదాలు కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా వారి నివాసాలు, అలాగే కుటు-ంబ సభ్యులు, బంధువుల వివరాలు రాబట్టిన అధికారులు నేడు వారి వ్యాపార లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీల పై ఐటీ- దృష్టి పెట్టింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా కంపెనీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు వారు చెల్లిస్తోన్న పన్నులుకూ మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ- అధికారులు గుర్తించినట్టు- తెలుస్తోంది.

తీర్థ, వైష్ణవి వ్యాపార సంస్థలపై నిఘా
మరోవైపు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ- అధికారులు పరిశీలించినట్లు- తెలుస్తోంది. అలాగే తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు వారి కుటు-ంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు గుర్తించినట్లు- విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement