కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్ కి కూడా వ్యాపించింది. దాంతో తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఒమిక్రాన్ వేరియంట్ తో టోలీచౌకీ పారామౌంట్ కాలనీ ఉలిక్కిపడింది. దాంతో 25హెల్త్ టీమ్స్ టోలిచౌకీ ప్రాంతంలో రంగంలోకి దిగాయి. 700 ఇళ్లలో టెస్ట్‌లు, ఇప్పటి వరకు 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు వైద్య అధికారులు. 36 గంటల తర్వాత ఈ పరీక్ష ఫలితాలు రానున్నాయి. ఒకవేళ కరోనా పాజిటివ్‌గా వస్తే జీనోమ్ సీక్వెన్స్‌కి శాంపిల్స్ పంపనున్నారు అధికారులు. ఈ తరణంలోనే టోలిచౌకి లోని పారామౌంట్ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. టోలిచౌకి లోని పారామౌంట్ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించడం తో.. హైదరాబాద్ వాసుల్లో టెన్షన్ ప్రారంభమయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement