హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా పాత బస్తీలోని బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను ఏప్రిల్ 19న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ని 69 కోట్లతో నిర్మించారు. 780 మీటర్ల ఫ్లైఓవర్ ఆరు లేన్‌లను కలిగి ఉంటుంది. ఇది అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందని స్థానికులు చెబుతున్నారు. బహదర్‌పురా వద్ద ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా ఇది మారుతుంది.
ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను సులభతరం చేయడంలో బహదూర్‌పురా ఫ్లైఓవర్ కీలకంగా మారుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
69 కోట్లతో బహుదూర్‌పురా ఫ్లై ఓవర్ నిర్మాణం.. రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement